Anchor Pradeep: ఏప్రిల్ 11వ తేదీని మా జీవితాలలో మర్చిపోలేం.! 3 d ago

యాంకర్ ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి జంటగా నటించిన “అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి” చిత్రం తాజాగా విడుదలై మంచి స్పందన పొందింది. హైదరాబాద్ లో జరిగిన సక్సెస్ మీట్లో ప్రదీప్ భావోద్వేగంతో స్పందించారు. మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మాకెంతో సంతోషంగా ఉంది. ఏప్రిల్ 11వ తేదీని మా జీవితాలలో మర్చిపోలేం మా చిత్రాన్ని అభిమానులు ఆదరించిన రోజు అది. అభిమానుల అసలైన స్పందన తెలుసుకోవాలని థియేటర్ లలో దాక్కొని సినిమా చూశామని చెప్పారు. నాని తనకు ఫోన్ చేసి అభినందించారని చెప్పారు. క్లీన్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం పేరు తెచ్చుకుంది.